India vs England


India vs England : తొలి టెస్టుకు భారత జట్టు ఇదే
అంటున్న మాజీ ప్లేయర్.. సిరాజ్ కు దక్కని చోటు ..

India vs England : ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా మరో సమరానికి రెడీ అవుతోంది. వచ్చే నెల 5 నుంచి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇంగ్లండ్‌, భారత్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. రెండో టెస్ట్ కూడా అక్కడే 

జరగనుంది. ఇప్పటికే ఆటగాళ్లు ఇప్పటికే చెన్నై చేరుకొని క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక గాయపడిన ఆటగాళ్లు జట్టులోకి రావడంతో తొలి టెస్టు కోసం భారత ప్లేయర్స్ మధ్య పోటీనెలకొంది.


ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా మరో సమరానికి రెడీ అవుతోంది. వచ్చే నెల 5 నుంచి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇంగ్లండ్‌, భారత్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. రెండో టెస్ట్ కూడా అక్కడే జరగనుంది. ఇప్పటికే ఆటగాళ్లు ఇప్పటికే చెన్నై చేరుకొని క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక గాయపడిన ఆటగాళ్లు జట్టులోకి రావడంతో తొలి టెస్టు కోసం భారత ప్లేయర్స్ మధ్య పోటీనెలకొంది.

ఇక ఆస్ట్రేలియా గడ్డపై ముగిసిన టెస్టు సిరీస్‌లో అంచనాలకి మించి రాణించిన ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ సిరాజ్‌, శార్ధూల్ ఠాకూర్, నవదీప్ సైనీలను ఆకాశ్ పక్కనపెట్టాడు. రవీంద్ర జడేజా గాయంతో దూరమవడంతో.. అతని స్థానంలో కుల్దీప్‌కి ఛాన్స్ ఇచ్చాడు.


ఆకాశ్ చోప్రా తుది జట్టు : రోహిత్ శర్మ, శుభమన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా.

Comments