Prabhas - Salaar: ప్రభాస్ అండ్ సలార్ టీమ్ కి షాక్.. లొకేషన్ ఫొటోలు లీక్డ్

 

రెబెల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం సలార్‌ షూటింగ్‌లో ఉన్నాడు. ఈ సినిమా లొకేషన్‌లో ప్రభాస్‌ లుక్‌కి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట లీక్‌ అయ్యాయిరెబెల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం సలార్‌ షూటింగ్‌లో ఉన్నాడు. ఈ సినిమా లొకేషన్‌లో ప్రభాస్‌ లుక్‌కి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట లీక్‌ అయ్యాయి







భారీ సినిమాల నిర్మాతలు వాళ్లని చూస్తే గజగజ వణుకుతున్నారట. ఇంతకీ నిర్మాతలను భయపెడుతున్నాదెవరో తెలుసా? లీకేజీ రాయుళ్లు. స్టార్‌ హీరోల సినిమాలకు లీకేజీ రాయుళ్ల నుంచి సమస్యలు తప్పడం లేదు. ఏదో ఒక రూపంలో అంటే ఫొటోలుగానో, వీడియోలుగానో సినిమాలను లీక్‌ చేసేస్తున్నారు మరి. ఇప్పుడు ప్రభాస్‌ లేటెస్ట్‌ ప్యాన్‌ ఇండియా మూవీ సలార్‌కు లీకేజీ రాయుళ్ల నుంచి సమస్యలు తప్పలేదు. వివరాల్లోకి వెళితే, రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ రీసెంట్‌గా 'సలార్‌' సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్‌ లుక్‌కి సంబంధించిన కొన్ని ఫొటోలను లీకేజీ వీరులు నెట్టింట పెట్టేశారు. ప్రభాస్‌ లుక్‌ చూస్తుంటే ప్రభాస్ ఏదో మెకానిక్‌ పాత్రను సలార్‌ సినిమాలో పోషించబోతున్నట్లు అనిపిస్తుంది. ప్రస్తుతం సలార్‌ సినిమా తెలంగాణలోని గోదావరి ఖనిలో షూటింగ్‌ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో యాక్షన్‌ సన్నివేశాలను ప్లాన్‌ చేశారు. ఆ సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ ఫొటోలు లీక్‌ అయ్యాయి. మరిప్పుడు సలార్‌ అండ్‌ టీమ్‌ లీకేజీ వీరుల పనికి బ్రేక్‌ వేయడంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.

కేజీయ‌ఫ్ ఛాప‌ర్ట్‌1’తో సెన్సేష‌న్ క్రియేట్ చేసి ‘కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ 2’ కోసం అంద‌రినీ ఆస‌క్తిగా ఎదురుచూసేలా చేసిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ‘సలార్’ సినిమాను డైరెక్ట్ చేస్తుండ‌టం తెలిసిన విష‌య‌మే. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తుంది. 'సలార్‌' అంటే సైన్యాధిపతి.. కింగ్‌ మేకర్‌ అనే అర్థం వస్తుందంటూ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెలియజేసిన సంగతి తెలిసిందే. మరి ఇందలో కింగ్ ఎవరు? అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. సినిమా కోసం ప్రభాస్‌ నాలుగు నెలల సమయాన్ని కేటాయించాడని టాక్‌ వినిపిస్తోంది.

సలార్‌' తర్వాత.. ప్ర‌భాస్‌, ఓం రావుత్ కాంబినేష‌న్‌లో రూపొందిన ‘ఆదిపురుష్‌’ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ను కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభించాలనుకుంటున్నాడు. ఈ సినిమాలో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపిస్తుంటే, రావ‌ణాసురుడి పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నాడు. కృతిస‌న‌న్ సీత పాత్ర‌లో క‌నిపిస్తుంద‌ని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నాడు.


Comments