RRR - Motor Cycle: ‘ఆర్ఆర్ఆర్‌’లో ఎన్టీఆర్ వాడిన బుల్లెట్ అస‌లు క‌థ తెలుసా..?

 

RRR - Motor Cycle: ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ ఉపయోగించిన మోటార్ సైకిల్‌కు సంబంధించిన ఆసక్తికరమైన కథనం ఉంది. ఆ బైక్ ఏకాలానికి చెందినదే వివరాలు మీకోసం










మోస్ట్ క్రేజీ ప్యాన్ ఇండియాప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం ర‌ణం రుధిరం)‌’ చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమాలో తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్ పాత్ర‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, ఆంధ్ర ప్రాంతానికి చెందిన మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ వాహ‌నంగా గుర్రం క‌న‌ప‌డితే, ఎన్టీఆర్ ఉప‌యోగించే వాహ‌నం బుల్లెట్‌. ఇది మేకింగ్ వీడియోస్‌లో మ‌న‌కు క‌నిపించిన సంగ‌తి తెలిసిందే.

ఎన్టీఆర్ ఉప‌యోగించిన బుల్లెట్‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నం ఉంది. ట్రిపుల్ ఆర్ 1920 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ మూవీ కావ‌డంతో అప్ప‌టి కాలానికి చెందిన బుల్లెట్‌ను జ‌క్క‌న్న అండ్ టీమ్ సిద్ధం చేశారు. వెలాసిటీ మ్యాక్ 350 సీసీ.. మోటార్ సైకిల్ అది. కేవ‌లం ఓ మ‌నిషి మాత్ర‌మే కూర్చోడానికి చోటు ఉండేలా స‌ద‌రు మోటార్ సైకిల్‌ను డిజైన్ చేశారు.


ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌తో పాటు అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌, స‌ముద్ర‌ఖ‌ని, హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడితో పాటు ఎన్టీఆర్ జోడీగా న‌టిస్తున్న హాలీవుడ్ తార ఒలివియా మోరిస్ త‌దిత‌రులు న‌టిస్తున్న చిత్ర‌మిది. సినిమాను ఈ ఏడాది ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13న విడుద‌ల చేయ‌బోతున్నారు. నాలుగు వంద‌ల కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో డి.వి.వి.దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Comments