Allu Arjun - Sukumar: రొమాంటిక్ యాంగిల్‌లోకి అల్లు అర్జున్‌ ' పుష్ప'.. అదిరిపోయే ప్లాన్ చేసిన సుకుమార్

jfe news 

Allu Arjun - Sukumar: 'పుష్ప' సినిమాను సీరియస్‌ మోడ్‌లో షురూ చేసిన సుకుమార్‌ ఇప్పుడు గేర్‌ మార్చి రొమాంటిక్‌ మోడ్‌లోకి తీసుకెళ్లబోతున్నాడట. అందులో భాగంగా నెక్ట్స్‌ షెడ్యూల్‌లో రొమాంటిక్‌ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నాడట. ఇంతకీ షెడ్యూల్‌ను సుకుమార్‌ ఎక్కడ ప్లాన్‌ చేశాడో తెలుసా..



స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ లేటెస్ట్‌ మూవీ 'పుష్ప' చిత్రీకరణలో బిజి బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ప్యాన్‌ ఇండియా మూవీ 'పుష్ప'. ప్రస్తుతం సినిమా రాజమండ్రి సమీపంలోని మారేడు మిల్లి అటవీ ప్రాంతంలో చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్‌ ప్రత్యేకంగా చిత్తూరుజిల్లా యాసను నేర్చుకోవడం విశేషం. బన్నీ ఇందులో పుష్పరాజ్‌ అనే లారీ డ్రైవర్‌ పాత్రలో కనిపిస్తాడని టాక్‌ వినిపిస్తుంది. కాగా.. ఈ సినిమాను సీరియస్‌ మోడ్‌లో షురూ చేసిన సుకుమార్‌ ఇప్పుడు గేర్‌ మార్చి రొమాంటిక్‌ మోడ్‌లోకి తీసుకెళ్లబోతున్నాడట. ప్రస్తుతం మారేడు మిల్లిలో జరుగుతున్న షెడ్యూల్‌ ఫిబ్రవరి 6 వరకు జరుగుతుంది. తర్వాత షెడ్యూల్‌ ఎక్కడ ప్లాన్‌ చేయాలనే దానిపై తన టీమ్‌కు సుకుమార్‌ క్లారిటీ ఇచ్చేశాడట. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు పుష్ప సినిమా తదుపరి షెడ్యూల్‌ తెన్‌ కాశీ, కేరళలో జరగనుంది.


ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. ఫిబ్రవరి 12 నుంచి పుష్ప కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో అల్లు అర్జున్‌తో పాటు రష్మిక మందన్న కూడా నటించనుంది. హీరో హీరోయిన్‌ మధ్య రొమాంటిక్‌ సన్నివేశాలు సాంగ్‌ను చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశాడట. ఎక్కువ గ్యాప్‌ తీసుకోకుండా సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసేస్తే తదుపరి వీఎఫ్‌ఎక్స్‌పై ఫోకస్‌ పెట్టొచ్చు అని బన్నీ, సుకుమార్‌ భావిస్తున్నారట. ఎందుకంటే.. ఇప్పటికే సినిమాను ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో ఆగస్ట్‌ 13న విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థలై మైత్రీ మూవీ మకర్స్‌, ముత్తం శెట్టి మీడియా ప్రకటించాయి.

బన్నీ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ మూవీగా 'పుష్ప' సినిమాను రూపొందుతుందని సమాచారం. సమాచారం మేరకు 'పుష్ప' సినిమాను రూ.180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నారట. రూ.180 కోట్ల బడ్జెట్‌లో అల్లు అర్జున్‌ రూ.40 కోట్లను రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే డైరెక్టర్‌ సుకుమార్ రూ.25 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నాడని సమాచారం. వీరిద్దరికే దాదాపు డెబ్బై కోట్ల రూపాయలు రెమ్యునరేషన్స్‌ రూపంలో వెళ్లిపోతున్నాయి.

Comments