షణ్ముఖ్ జస్వంత్ ఎంత మద్యం తాగాడో తెలిస్తే..."అరేయ్ ఏంట్రా ఇదీ" అంటున్న నెటిజన్స్... on February 28, 2021 Get link Facebook X Pinterest Email Other Apps వెబ్ సిరీస్ లలో ఎంతో సున్నితంగా కనిపించే షణ్ముఖ్ రియల్ లైఫ్ లో మాత్రం బ్యాడ్ బాయ్ అనే పేరు తెచ్చుకున్నాడు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మాత్రం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో మూడు కార్లు రెండు ద్విచక్ర వాహనాలను షణ్ముఖ్ కారు ఢీ కొట్టింది.నటుడు, సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ జస్వంత్ మద్యం మత్తులో అతివేగంగా వాహనం నడుపుతూ మూడు వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. యూట్యూబ్ లో రాత్రికి రాత్రే స్టార్ గా నిలిచిన షణ్ముఖ్ జస్వంత్ ప్రస్తుతం ఓ టీవీ చానెల్ రియాలిటీ షోలో సైతం పార్టిసిపేట్ చేస్తున్నాడు. అయితే తాజాగా అతడు ప్రధాన పాత్రలో వచ్చిన సాప్ట్ వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ మంచి ఆదరణ పొందింది. అంతే కాదు షణ్ముఖ్ జస్వంత్ కు అటు సోషల్ మీడియాలో కూడా చక్కటి ప్రజాదరణ ఉంది. వెబ్ సిరీస్ లలో ఎంతో సున్నితంగా కనిపించే షణ్ముఖ్ రియల్ లైఫ్ లో మాత్రం బ్యాడ్ బాయ్ అనే పేరు తెచ్చుకున్నాడు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మాత్రం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో మూడు కార్లు రెండు ద్విచక్ర వాహనాలను షణ్ముఖ్ కారు ఢీ కొట్టింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నటుడు షణ్ముఖ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో షణ్ముఖ్ మోతాదుకి మించి మద్యం సేవించాడని తెలుస్తోంది. బ్రీత్ అనలైజర్ టెస్టులో 170 పాయింట్లుగా తేలడంతో కారు సీజ్ చేశామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.గతంలో హీరో నిఖిల్, యాంకర్ ప్రదీప్, ఇప్పుడు షణ్ముఖ్ జస్వంత్ లాంటి సెలబ్రిటీ స్టేటస్ పొందిన యువకులు ఇటువంటి వివాదాల్లో చిక్కుకోవడంతో వారి అభిమానుల్లో సైతం ఆందోళన నెలకొంది. అయితే షణ్ముఖ్ జస్వంత్ మద్యం మత్తులో ఇలా చేయడం వెనుక బలమైన కారణం ఉందనే పేరు వినిపిస్తోంది. దీనిపై విచారణలో నిజాలు బయటపడే అవకాశం ఉంది. అయితే షణ్ముఖ్ జస్వంత్ తాజాగా మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో కవరేజీ కోసం వచ్చిన జర్నలిస్టులను సైతం దుర్భాషలు ఆడినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ కేసు పలు ట్విస్టులతో సాగుతోంది. ఇదిలా ఉంటే షణ్ముఖ్ జస్వంత్ తన వెబ్ సిరీస్ లలో అరేయ్ ఏంట్రా ఇదీ అనే డైలాగ్ తో ఫేమస్ అవ్వడం విశేషం. Comments
Comments
Post a Comment