Chris Gayle: గేల్ సునామి: 22 బంతుల్లో 84 పరుగులు – వీడియో

jfe news 

Abu Dhabi T10 league: జట్టు మొత్తం పరుగులు 100 కాగా.. అందులో క్రిస్ గేల్​ (Chris Gayle)వే 84. 22 బంతుల్లోనే సిక్సర్ల సునామితో అతడు జట్టును గెలిపించాడు.



వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్​మన్​ క్రిస్ గేల్.. అబుదాబి టీ10 లీగ్​ మరోసారి విజృంభించాడు. ఎడాపెడా సిక్సర్లు బాది ఏకంగా 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మొత్తంగా 22 బంతుల్లోనే 381 స్ట్రయిక్ రేట్​తో 84 పరుగులు చేశాడు.

ఈ లీగ్​లో టీమ్ అబుదాబి తరఫున ఆడుతున్న గేల్​.. మరాఠా అరేబియన్స్​తో జరిగిన మ్యాచ్​లో ఈ విధ్వంసం సృష్టించాడు. 9 సిక్స్​లు, ఆరు ఫోర్లతో చెలరేగిపోయాడు.

మొదట బ్యాటింగ్ చేసిన అరేబియన్స్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లకు 97 పరుగులు చేసింది. ఆ తర్వాత టీమ్ అబుదాబి టార్గెట్ ఛేజింగ్​కు దిగింది. ప్రారంభం నుంచి గేల్​ సిక్సర్ల మోత మెగించడంతో 5.3 ఓవర్లలో టీమ్​అబుదాబి 100 పరుగులు చేసి గెలిచింది. వందలో 84 రన్స్ గేల్​వే కావడం విశేషం. అందులో 78 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. క్రీజులోకి వచ్చాక తొలి ఓవర్ నుంచి గేల్ రెచ్చిపోయాడు. తన మార్క్ హిట్టింగ్​తో ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించాడు. మైదానం నలువైపులా హిట్టింగ్​తో మోతెక్కించాడు.


Comments