Jr NTR: కొత్త గెటప్‌లో ఎన్టీఆర్ దర్శనం.. సోషల్ మీడియాలో వైరల్.... on February 04, 2021 Get link Facebook X Pinterest Email Other Apps jfe news Jr NTR: కొత్త గెటప్‌లో దర్శనమిచ్చిన ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. Jr NTR: కొత్త గెటప్‌లో దర్శనమిచ్చిన ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్.. నిన్న వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ‘ఉప్పెన’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సరికొత్త లుక్‌లో కనిపించి అభిమానులను కనువిందు చేసాడు. ఈ సందర్భంగా గుబురు గడ్డం మీసాలతో ఎన్టీఆర్ కొత్త కనిపించాడు. తాజాగా ఎన్టీఆర్ లేటెస్ట్ ఫోటోస్‌ను అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో తారక్.. స్వాతంత్య్ర సమరయోధుడు కొమరం భీమ్ పాత్రలో అలరించనున్నాుడ. రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ ఈ చిత్రంలో కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటించనున్నాడు.ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ మూవీ చేయనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పవర్‌ఫుల్ రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. నాగ తర్వాత మరోసారి పొలిటికల్ లీడర్ పాత్రలో తారక్ అలరించనున్నట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నాడు. సలార్ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.మరోవైపు అట్లీతో పాటు వక్కంతం వంశీ, నాగ్ అశ్విన్ సహా పలువురు దర్శకులతో ఎన్టీఆర్ సినిమాలు చేయనున్నట్టు సమాచారం. Comments
Comments
Post a Comment