NBK: | ప్రస్తుతం నందమూరి నట సింహం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ దర్శకుడితో నెక్ట్స్ మూవీకి ముహూర్తం దాదాపు ఖరారైంది.
NBK | ప్రస్తుతం నందమూరి నట సింహం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా వేగంగానే జరుగుతుంది. తాజాగా ఈ సినిమాను మహానటుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఒక బాలయ్య సోలో హీరోగా నటించిన సినిమా తండ్రి పుట్టినరోజున విడుదల కావడం ఇదే మొదటిసారి. గతంలో బాలయ్య, తన తండ్రితో కలిసి నటించిన ‘శ్రీమద్విరాట పర్వం’ అనే సినిమా మాత్రమే ఎన్టీఆర్ బర్త్ డే రోజున విడుదలైంది. ఒక రకంగా ఎన్టీఆర్ పుట్టినరోజున విడుదల కాబోతున్న బాలయ్య రెండో సినిమా అనే చెప్పాలి. సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు ‘టార్చ్ బేరర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి డ్యూయల్ రోల్లో కవల సోదరులుగా నటిస్తున్నాడు. అంతేకాదు ఒకటి అఘోర పాత్ర అయితే.. మరొకటి కలెక్టర్ పాత్ర అని చెబుతున్నారు.
తాజాగా ఈయన బాలకృష్ణతో ఈయన సినిమా ఖరారైంది. ఇప్పటికే గోపిచంద్ మలినేని .. బాలయ్య ఇమేజ్‌కు తగ్గ ఓ కథను వినిపించి ఓకే చేయించుకున్నాడు. బాలయ్య కూడా ఇప్పట్లో మంచి ముహూర్తలు లేనందున మే లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభించి.. అప్పటి నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ కాంబినేషన్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్త మైత్రీ మూవీ మేకర్స్ న నిర్మిస్తున్నారు. ఇక బోయపాటి శ్రీనుతో చేయబోయే సినిమాను మార్చి సెకండ్ వీక్‌లో గుమ్మడికాయ కొట్టేయనున్నారు. మరోవైపు బాలయ్య.. పూరీ జగన్నాథ్, అనిల్ రావిపూడితో పాటు శ్రీవాస్, బి.గోపాల్‌లతో నెక్ట్స్ ప్రాజెక్టులు ఓకే చేసినట్టు సమాచారం. మొత్తంగా బాలయ్య తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేనితో చేయడం ఖరారైంది
Comments
Post a Comment