Nithin Check : చెక్ సినిమా కోసం మొదటిసారి ఆ ప్రయోగం చేస్తున్న నితిన్.. on February 12, 2021 Get link Facebook X Pinterest Email Other Apps jfe news యువ హీరో నితిన్, రకుల్ ప్రీత్, ప్రియా వారియర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం చెక్. ఈ సినిమాకు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నాడు.యువ హీరో నితిన్, రకుల్ ప్రీత్, ప్రియా వారియర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం చెక్. ఈ సినిమాకు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్ ఈ సినిమాలో ఖైదీగా నటిస్తున్నాడు. కాగా 'చెక్' చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ సందర్భంగా ఈ సినిమా నిర్మాత ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ.. ఇందులో సందర్భానుసారం ఒకే ఒక్క పాట ఉందని తెలిపాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయనీ, ఈ నెల 26న చిత్రాన్ని రిలీజ్ చేస్తామనీ చెప్పాడు. చెక్‌లో హీరో నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. ఇక సినిమాలో ఉన్న ఏకైన సాంగ్‌ను నితిన్, ప్రియా ప్రకాశ్ వారియర్‌పై ఇటీవల గోవాలో తెరకెక్కించినట్లు తెలిసింది. ఈ సినిమాకు కల్యాణీ మాలిక్ అందించాడు. అయితే సినిమాలో కథానుగుణంగా ఒక్క పాటకు మాత్రమే సందర్భం కుదిరిందని.. దీంతో ఒక్క పాటను మాత్రమే పెట్టాల్సి వచ్చిందని.. అయితే ఇదేదో కావాలనీ చేసింది కాదని తెలిపాడు నిర్మాత. ఈ పాటను మూడు రోజుల పాటు శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో ఫినిష్ చేశారట. అయితే ఇలా నితిన్ సినిమాలో ఒకే సాంగ్ ఉండడం మొదటిసారి. ఇది ఆయనకు ఓ ఎక్స్‌పరిమెంట్ లాంటిదే.. చూడాలి మరి ఎలా ఉండనుందో..ఇక ఈ నెల 26 ఈ సినిమా విడుదలవ్వడంతో ఇటీవల చెక్ నుండి ట్రైలర్ విడుదలైంది. 'యద్భావం తద్భవతి' అన్న ఉద్బోధతో ట్రైలర్ ప్రారంభమైంది. ఇక ట్రైలర్‌ను పరిశీలిస్తే.. ఆకట్టుకునే మాటలతో, సన్నివేశాలతో నితిన్ చెక్ అదరగొడుతోంది. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్, హర్షవర్థన్, రోహిత్, సిమ్రాన్ చౌదరి ఇతర పాత్రల్లో కనిపించనున్నారుఇక నితిన్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తూ సూపర్ బిజీగా ఉన్నాడు. చాలా కాలం తర్వాత మంచి ఇటీవల వచ్చిన భీష్మతో మంచి హిట్ అందుకున్న నితిన్.. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చేస్తున్నాడు. వెంకీ గతంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ, అఖిల్ అక్కినేని మజ్నులకు దర్శకత్వం వహించాడు. ఇది ఆయనకు మూడో సినిమా. రంగ్ దేలో నితిన్ సరసన మొదటిసారి కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకుంది. దీంతో ఇక ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు మంచి ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాయని సమాచారం. రంగ్ దే శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ను జీ నెట్వర్క్ (జీ తెలుగు & జీ 5) దక్కించుకుంది. ఈ డీల్ విలువ దాదాపు 10కోట్లని సమాచారం. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు.ఇక సినిమాతో పాటు నితిన్ మరో సినిమాకు కూడా ఓకే చెప్పాడు. హిందీలో సూపర్ హిటైనా అంధధూన్ రీమేక్‌లో నితిన్ నటించనున్నాడు. ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తోండగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో నితిన్‌కు జంటగా నభా నటేష్ నటిస్తోండగా.. టబు పాత్రలో తమన్నా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. Comments
Comments
Post a Comment