Prabhas - Radhe Shyam: నా యాల్ది... ‘రాధేశ్యామ్’ సెట్స్ నుంచి కిరాక్ ఫొటోను షేర్ చేసిన కృష్ణంరాజు

 

Prabhas - Radhe Shyam: రాధేశ్యామ్ పెండింగ్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో కృష్ణంరాజు, ప్రభాస్ నటిస్తున్నారు. లేటెస్ట్‌గా తనతో ప్రభాస్ ఉన్న ఫొటోను షేర్ చేశారు కృష్ణంరాజు షేర్ చేశారు. ఇప్పుడు ఆ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.



రెబెల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్‌’ షూటింగ్ ఫైన‌ల్ స్టేజ్‌కు వ‌చ్చింది. దాదాపు వారం రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది. ఇప్పుడు పెండింగ్ పార్ట్‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. కృష్ణంరాజు, ప్ర‌భాస్ క‌లిసి ఉండే స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ కృష్ణంరాజు రాధేశ్యామ్ సెట్స్ నుంచి కిర్రాక్ ఫొటోను త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఈ ఫొటోలో కృష్ణంరాజు, ప్ర‌భాస్ స్టైల్‌గా నిల‌బ‌డి ఉన్నారు. కృష్ణంరాజు, ప్ర‌భాస్ ..1970 బ్యాక్‌డ్రాప్‌లో జ‌రిగే క‌థ‌లో క‌నిపిస్తార‌ట‌. ఈ విష‌యాన్ని కృష్ణంరాజు తెలియ‌జేశారు. ఈ ఫొటో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. మ‌రో వైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ పీరియాడికల్ ల‌వ్‌స్టోరికి సంబంధించి రీసెంట్‌గా గ్లింప్స్ విడుద‌లై సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అలాగే ఈ ప్యాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి హిందీ వెర్ష‌న్‌కు ఇద్ద‌రు సంగీత ద‌ర్శ‌కులు ప‌నిచేస్తున్నారు. మిథున్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రెండు సినిమాలు, మ‌న‌న్ భ‌ర‌ద్వాజ్ ఒక పాట‌కు సంగీతాన్ని అందించారు. ఇక తెలుగు,తమిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఈ పాట‌ల‌కు జ‌స్టిన్ ప్ర‌భాక‌ర్ సంగీతాన్ని అందిస్తాడ‌ట‌.

Comments