Ram Charan - Jr NTR: క్లైమాక్స్ కోసం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రాక్టీస్ సెషన్స్..

ntr news 

Ram Charan - Jr NTR: రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న ట్రిపుల్ ఆర్ గురించి కేవలం మన ఇండస్ట్రీ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీలు కూడా వేచి చూస్తున్నాయి.



రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న ట్రిపుల్ ఆర్ గురించి కేవలం మన ఇండస్ట్రీ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీలు కూడా వేచి చూస్తున్నాయి. బాహుబలితో ఆయన వేసిన పునాది అలా ఉంది మరి. అందుకే జక్కన్న సినిమా కోసం అంతా కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు. అన్ని పరిస్థితులు బాగుండుంటే ఈ పాటికి ట్రిపుల్ ఆర్ మరో రెండు మూడు నెలల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చుండేది. కానీ కోవిడ్ వచ్చి అంతా నాశనం చేసింది. గత కొన్ని రోజులుగా ఈ చిత్ర షూటింగ్ అన్ని జాగ్రత్తల మధ్య జరుగుతుంది. దానికితోడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగానే జరుగుతున్నాయి. మధ్యలో రాజమౌళికి కరోనా రావడం.. నిర్మాత దానయ్య కూడా కోవిడ్ బారిన పడటంతో షూటింగ్ విషయమే అంతా మరిచిపోయారు. ఆ తర్వాత రామ్ చరణ్ కూడా కోవిడ్ బారిన పడటంతో మరిన్ని రోజులు ఆలస్యమైంది ట్రిపుల్ ఆర్ షూటింగ్. ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌పై అప్ డేట్ బయటికి వచ్చింది. ట్రిపుల్ ఆర్ చిత్ర షూటింగ్ అల్యూమీనియం ఫ్యాక్టరీలోనే చాలా వరకు జరిగింది. ఇప్పటికీ అక్కడ కొన్ని ప్యాచ్ వర్కులు చేస్తూనే ఉన్నాడు రాజమౌళి. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ షూటింగ్ క్లైమాక్స్ వేగంగా జరుగుతుందిప్పుడు. దీనికి సంబంధించిన అప్ డేట్స్ కూడా ఎప్పటికప్పుడు అభిమానులకు అందిస్తున్నాడు రాజమౌళి.

ఈ క్రమంలోనే తాజాగా రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా క్లైమాక్స్ కోసం ప్రాక్టీస్ సెషన్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు అప్ లోడ్ చేసారు హీరోలిద్దరూ. అటు చరణ్.. ఇటు తారక్ ఇద్దరూ నవ్వుతూ ఉన్న ఫోటోలు చూసి పండగ చేసుకుంటున్నారు అభిమానులు. 2021 అక్టోబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో దానయ్య ట్రిపుల్ ఆర్ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇందులో హాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారు. మరోవైపు చరణ్‌కు జోడీగా అలియా భట్.. ఎన్టీఆర్‌కు జోడీగా ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఏదేమైనా క్లైమాక్స్ వరకు షూటింగ్ రావడంతో పండగ చేసుకుంటున్నారు అభిమానులు.

Comments