Jathi Ratnalu Trailer: జాతి రత్నాలు ట్రైలర్ విడుదల.. డిఫరెంట్ కామెడీ థ్రిల్లర్ ..

 

Jathi Ratnalu Trailer:  ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఇతను జాతిరత్నాలు సినిమాతో పలకరించబోతున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.



athi Ratnalu Trailer:  ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ పోలిశెట్టి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో నటుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘డి ఫర్ దోపిడి’, మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చని ‘నేనొక్కడినే (వన్)  సినిమాలో ముఖ్యపాత్రలో నటించారు. ఇక ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో నవీన్ పోలీశెట్టి పేరు మారుమ్రోగిపోయింది.ఈ సినిమాలో చంటబ్బాయి తరహాలో కామెడీ ప్రైవేటు డిటెక్టివ్‌గా ఆకట్టుకున్నాడు.  ఆ తర్వాత హిందీలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, శ్రద్ధా కపూర్‌ల ‘చిచ్చరే’ సినిమాలో తన యాక్టింగ్‌తో మెప్పించాడు. ప్రస్తుతం ఇతను ‘జాతిరత్నాలు’ అనే సినిమా చేసాడు. ఈసినిమాను వైజయంతీ మూవీస్ అనుబంధ సంస్థ స్వప్నా సినిమాస్ పతాకంపై నాగ్ అశ్విన్ ప్రొడ్యూస్ చేసాడు. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసారు.

ఈ ట్రైలర్‌లో హీరో పదో తరగతిలో 60 శాతం మార్కులతో పాస్ అవుతాడు. ఇంటర్‌లో 50 శాతం, డిగ్రీ బీటెక్‌లో మాత్రం 40 శాతం మార్కులు తెచ్చుకుంటాడు. ఎంటెక్ ఎందుకు చేయలేదంటే.. 30 శాతం వస్తాయనే భయంతో చేయలేదని సైటెరికల్‌గా చెప్పాడు. డిగ్రీలో అత్తెసరు మార్కులతో పాస్ అయిన హీరో శ్రీకాంత్ ఎంపోరియమ్‌లో లేడీస్‌కు సంబంధించిన షాప్‌లో చీరలు గట్రా అమ్ముతూ ఉంటారు. ఇతనికో ఇద్దరు స్నేహితులుంటారు. ఇలాంటి హీరో ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. కట్ చేస్తే .. ఏదో నేరంపై హీరో తన స్నేహితులుతో కలిసి జైలు పాలు అవుతాడు. జైలు నుంచి తిరిగొచ్చిన వీళ్లు జాతి రత్నాలుగా ఎలా కీర్తింపబడ్డారనేదే జాతి రత్నలు మూవీ. ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రాన్ని మార్చి 11న థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. మరి ఈ సినిమాతో నవీన్ పోలిశెట్టి మరో హిట్టు అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

Comments