Ntr - Ram Charan: ‘RRR’లో ఎన్టీఆర్ కోసం గూజ్‌బమ్స్ వ‌చ్చేలా ఇంట్ర‌డ‌క్ష‌న్‌ ఫైట్ డిజైన్ చేసిన జ‌క్క‌న్న‌.. ఫైట్ ఫొటో లీక్‌ వైరల్

 

Ntr - Ram Charan: ‘ఆర్ఆర్ఆర్’లో తారక్ ఇంట్రడక్షన్ ఫైట్‌ను అదిరిపోయే రేంజ్‌లో రాజమౌళి అండ్ టీమ్ డిజైన్ చేశారట. ఈ ఫైట్‌కు సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది



భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి సినీ క్రియేట‌ర్స్‌, స్టార్ యాక్ట‌ర్స్ ప‌డే తంటాలు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అయితే మాకేం అని అంటున్నారు లీకేజీ రాయుళ్లు. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా, జాగ్ర‌త్త‌గా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘RRR’ యావ‌త్ భార‌త్ సినిమానే కాదు, ప్ర‌పంచంలోని సినీ అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను లీకేజీ బాబులు వ‌ద‌ల‌డం లేదు. కొన్ని లొకేష‌న్ ఫొటోల‌ను లీక్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా లీకైన పొటోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.

ఇప్పుడు ఎన్టీఆర్ ఇంట్ర‌డ‌క్ష‌న్ ఫైట్‌కు సంబంధించిన ఫొటో ఒక‌టి లీక్ అయ్యింది. ఈ ఫొటో చూస్తుంటే ఎన్టీఆర్‌, పులి మ‌ధ్య జ‌రిగే ఫైట్ అని స్ప‌ష్ట‌మ‌వుతుంది. ‘రామ‌రాజు ఫ‌ర్ భీమ్’ వీడియో చూస్తే.. అందులో ఎన్టీఆర్ ఒంటికి ర‌క్త‌మంతా పూసుకుంటూ ఉండే సీన్ ఉంటుంది. ఆ సీన్ ఇంట్ర‌డ‌క్ష‌న్ ఫైట్ సంద‌ర్భంలోనే వ‌స్తుంద‌ట‌. అడ‌విలో జ‌నాల‌ను చంపే పులిని మ‌ట్టు పెట్ట‌డానికి కొమురం భీమ్ పాత్ర‌ధారి అయిన ఎన్టీఆర్ ఒళ్లంతా ర‌క్తం పూసుకుని పులిని త‌న ద‌గ్గ‌ర‌కు ర‌ప్పించేలా చేసి దాన్ని మ‌ట్టు బెట్టే ఫైట్ ఎన్టీఆర్ ఇంట్ర‌డ‌క్ష‌న్ ఫైట్‌గా జ‌క్క‌న్న డిజైన్ చేశాడు. ఈ ఫైట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కే కాదు, యావ్ సినీ ల‌వ‌ర్స్‌కు పూన‌కాలు తెప్పించేలా డిజైన్ చేశార‌ని టాక్‌. లీకైన పొటో చూస్తున్న ఫ్యాన్స్ టైగ‌ర్ వ‌ర్సెస్ టైగ‌ర్ అని అంటున్నారు మ‌రి.
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్‌(ర‌ణం రౌద్రం రుధిరం)’. గోండు వీరుడు కొమురం భీమ్ పాత్ర‌లో ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. ఇంకా అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌, స‌ముద్ర‌ఖని, శ్రియా శ‌ర‌న్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. సినిమాను ఈ ఏడాది ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Comments